రష్మికకు మరో గోల్డెన్ ఛాన్స్.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

03  February 2025

Basha Shek

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాతో  రష్మిక మంద్నా పేరు మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగిపోతోంది

మొదటి పార్ట్ తో పోల్చుకుంటే  ఇందులో శ్రీవల్లిగా రష్మిక అభినయం నెక్ట్స్ లెవెల్ అని ప్రశంసలు, కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి.

పుష్ప 2 తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టుతో మన ముందుకు వస్తోంది రష్మిక. అదే ఛవ్వా. విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

మరాఠాల చారిత్రాత్మక కథనం, అంశాలతో తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  

దీంతో పాటు ధనుష్, నాగార్జునల కుబేర, సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన్నా.

అలాగే రెండు ఓరియంటెడ్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోందీ అందాల తార. తాజాగా రజనీ సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చిందని సమాచారం.

కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, రష్మిక మందన్న మరోసారి జంటగా కనిపించనున్నారు

ఇదే బాలీవుడ్ సినిమాలో ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా ఒక ముఖ్యపాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.