హైదరాబాద్ పేరు చెప్పి ట్రోల్ అవుతోన్న రష్మిక..

14  February 2025

Basha Shek

నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు.

అయితే కర్ణాటకలో మాత్రం కొందరు ఈ ముద్దుగుమ్మను అదే పనిగా ద్వేషిస్తుంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

 ఇప్పుడు రష్మిక మందన్నాను ట్రోల్ చేయడానికి కన్నడిగులకు కొత్త కారణం దొరికింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

రష్మిక మందన్న 'ఛావా' సినిమాలో విక్కీ కౌశల్ సరసన నటించింది. ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 14) విడుదలైంది

ఈ చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమం ముంబైలో జరిగింది. అందులో రష్మిక చేసిన కామెంట్స్ కన్నడిగులను కోపానికి గురి చేశాయి.

నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని గర్వంగా చెబుతుంటాను' అని రష్మిక చెప్పడంపై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.  

'రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయింది?'  'విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకముందే రష్మిక హైదరాబాద్‌కు మారిపోయిందా?

 ' రష్మిక తన సొంత ఊరును మర్చిపోయింది, నిన్ను ద్వేషించడానికి నువ్వు ఎప్పుడూ మాకు కొత్త కారణాలు ఇస్తావు' అంటూ నెటిజన్లు రష్మికను ట్రోల్ చేస్తున్నారు.