20 January 2024

ఆ స్టార్ హీరోతో నటించేందుకు వెయిట్ చేస్తోన్న రష్మిక.. ఎవరంటే.. 

TV9 Telugu

Pic credit - Instagram

రష్మిక మందన్నా.. ఈపేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మారుమోగుతుంది. అంతగా యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఈ బ్యూటీ. 

 ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమా గర్ల్ ఫ్రెండ్‏లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుగుతున్నాయి. 

కానీ రష్మికకు మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ జోడిగా నటించాలని ఉందట. ఆయన సినిమాలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. 

 ధనుష్ మంచి పర్ఫార్మర్ అని.. ఆయన పక్కన నటించడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని..అందుకే అతడితో నటించేందుకు వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. 

 ఇదిలా ఉంటే.. ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న కొత్త ప్రాజెక్టులో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ హీరో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 

ఇందులో రష్మిక హీరోయిన్‏గా కనిపించనుంది. ఇదివరకే తమిళంలో ఆమె పలు హిట్ చిత్రాల్లో నటించింది. విజయ్ సరసన వారసుడి సినిమాలో కనిపించి మెప్పించింది. 

ఇక అటు హిందీలో.. ఇటు తెలుగులో.. తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. అదే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది.