ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ అంటే రష్మికనే. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను ఈ ముద్దుగుమ్మ ఏలేస్తుంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ
పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకుంది రష్మిక. దీంతో హిందీలో వరుస మూవీ ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో గీతాంజలి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తుంది. అలాగే రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో యాక్ట్ చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే.. రష్మిక ఇప్పుడు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందట. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పారితోషికం తక్కువే. ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటుందట.
ఇక తెలుగులో మాత్రం ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపి అయిన అవుతుంది.
అయితే ప్రస్తుతం రష్మికకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సమయంలో రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుండడంతో ఇచ్చేందుకు కూడా మేకర్స్ సిద్ధమయ్యారని టాక్.
అటు సినిమాలే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్ కూడా చేస్తుంది రష్మిక. నివేదికల ప్రకారం నేషనల్ క్రష్ నెలకు దాదాపు రూ. 70 లక్షలకుపైగా సంపాదిస్తుందని తెలుస్తోంది.