ఇక్కడ రిజెక్ట్ చేస్తే అక్కడ దెబ్బ పడిందా ?.. ఆ సినిమాతో రష్మికకు ఊహించని షాక్..
03 September 2023
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్లో పుల్ ఫాంలో ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఇప్పుడు ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.
ఓవైపు అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ జోడిగా యానిమల్ చిత్రంలో నటిస్తోంది రష్మిక.
ఈ రెండు చిత్రాలే కాకుండా ఇటు తెలుగుతోపాటు.. తమిళం, హిందీలోనూ మరికొన్ని చిత్రాల్లో నటిస్తుంది. ఇవన్ని షూటింగ్స్ జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది రష్మిక. షాహీద్ కపూర్ సరసన నటించే అవకాశాన్న సొంతం చేసుకుంది నేషనల్ క్రష్.
ఈ సినిమా కోసం తెలుగులో హీరో నితిన్ సరసన నటించే అవకాశాన్ని వదులుకుంది. నిజానికి భీష్మ సినిమాతో సక్సెస్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది ఈ జంట.
ఇక ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం షాహీద్ కపూర్ సరసన నటించే బాలీవుడ్ చిత్రం బడ్జెట్ కారణంగా ఆగిపోయిందని విషయం రష్మికకు షాకిచ్చింది.
అయితే ఏ సినిమా కోసమైతే టాలీవుడ్ అవకాశాన్ని పక్కనపెట్టేసిందో ఇప్పుడు అదే చిత్రం షూటింగ్ స్టార్ట్ కాకముందే ఆగిపోవడంతో రష్మికకు షాక్ తగిలింది.
దీంతో రష్మిక ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటి అంటూ సోషల్ మీడియాలో రష్మిక గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.