11 October 2023

రెండు భాగాలుగా జగన్ బయోపిక్.. రిలీజ్ ఎప్పుడంటే 

 వ్యూహం మూవీపై రామ్‌గోపాల్‌ వర్మ అప్‌డేట్‌ -- రెండు పార్ట్‌లుగా వ్యూహం మూవీ -- నవంబర్‌ 10న రిలీజ్‌ కానున్న వ్యూహం-1 -- జనవరి 25న వ్యూహం-1 సీక్వెల్‌ శపథం రిలీజ్‌ -- మూవీ పోస్టర్లను ట్వీట్‌ చేసిన రామ్‌గోపాల్‌ వర్మ 

వ్యూహం.. అంతకుమించి శపథం.. అంటూ సినీ ఇండస్ట్రీలోనే కాదూ ఏపీ పాలిటిక్స్‌లోనూ హీట్ పుట్టించారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ.

వ్యూహం మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కించారు ఆర్జీవీ. వ్యూహం-1కి సీక్వెల్‌గా వ్యూహం-2 పేరుతో కాకుండా శపథం పేరుతో వస్తుందని బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఇందుకు సంబంధించి పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆర్జీవీ.. వ్యూహం సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండో టీజర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా నవంబర్‌ 10న రిలీజ్ కానుంది. అలాగే వ్యూహానికి సీక్వెల్‌గా వస్తున్న శపథం మూవీ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల అవుతుందని ప్రకటించారు ఆర్జీవీ.

 వైఎస్‌ హఠాన్మరణం ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, రాష్ట్ర విభజన లాంటి సున్నితమైన అంశాలతో పాటు చంద్రబాబు, పవన్‌ భేటీలను.. 2నిమిషాల 14సెకన్ల నిడివి ఉన్న వ్యూహం టీజర్‌లో చూపించారు.

ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన నిరాహార దీక్షలు, వైసీపీ శ్రేణుల ఆందోళన, అక్రమ కేసులతో జైలు జీవితాన్ని గడపడం.. కుటుంబసభ్యులు బాధపడటం లాంటివి ఇందులో చూపించారు.

ఓ సన్నివేశంలో చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ పాత్రలు కూడా కనిపించాయి. చిరంజీవి, పవన్‌ మధ్య విభేదాలు ఉన్నట్టు.. ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు చూపించారు ఆర్జీవి.

 నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుందని జగన్ పాత్ర పోషించిన అజ్మల్ చెప్పడం టీజర్‌లో కనిపించింది.