10 September 2023

రకుల్‏కు లక్కీ ఛాన్స్..  మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కనిపించనున్న బ్యూటీ.. 

Pic credit - Instagram

 వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

 తెలుగుతోపాటు హిందీలో స్టార్ హీరోస్ సరసన నటించి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేది. 

కానీ చాలాకాలంగా ఈ బ్యూటీ తెలుగులో నటించలేదు. చివరిసారిగా కొండపొలం చిత్రంలో నటించింది.  ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 

అటు హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే ఓటీటీలోక అడుగుపెడుతుంది. వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమయ్యింది. 

ఈక్రమంలోనే తాజాగా రకుల్ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మెగాస్టా్ర్ చిరంజీవి కొత్త సినిమాలో ఈ బ్యూటీ నటించనుందట

మెగాస్టార్ 156 సినిమాలో రకుల్ ను రంగంలోకి దించే పనిలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే రకుల్ ను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. 

 ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

అయితే చిరుతో తొలిసారిగా రకుల్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.