06 September 2023
రజినీకాంత్కు రూ.210 కోట్ల రెమ్యూనరేషన్..
ఏకైక హీరోగా రికార్డ్..
Pic credit - Instagram
తలైవా నటించిన జైలర్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పటివరకు ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేవలం ఇండియాలోనే రూ.350 కోట్లు రాబట్టింది.
ఇక తలైవా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. తాజాగా మరో రికార్డ్ సృష్టించారు సూపర్ స్టార్ రజినీ కాంత్.
ఈ సినిమాతో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రజినీ నిలిచారు. కేవలం తలైవాకు మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమయ్యింది.
జైలర్ సినిమాకు ఇప్పటికే రూ.110 కోట్లు పారితోషికం తీసుకున్నారు రజినీకాంత్. సినిమా విడుదలయ్యే నాటికి పారితోషికం తీసుకున్నారు కూడా.
అయితే ఇటీవల మరో సర్ ప్రైజ్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. జైలర్ సినిమా భారీగా వసూళ్లు రాబడుతుండడంతో మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
దీంతో రజినీకి మరోసారి రూ.100 కోట్లు చెక్ ఇవ్వడమే కాకుండా మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. చెక్ తోపాటు ఆయనకు బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చారు
రజినీకి ఇచ్చిన బీఎండబ్ల్యూ ఎక్స్ 7 మోడల్ కారు ధర రూ.2.25 కోట్లు అని తెలుస్తోంది. ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నారు రజినీ.
ఇక్కడ క్లిక్ చేయండి.