సినిమా ఛాన్సుల కోసం రూట్ మార్చిన రాఖీ ఖన్నా.. 

TV9 Telugu

11 March 2024

 థ్యాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాల తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.

కేవ‌లం ఫ‌ర్జీ అనే హిందీ వెబ్ సిరీస్‌లో మాత్ర‌మే న‌టించింది. ఇక తమిళంలో కూడా తిరు తర్వాత మరే మూవీలోనూ నటించలేదు.

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజిబిజీగా ఉన్న రాశీ ఖన్నా చేతిలో ఇప్పుడు 2,3 సినిమాలు మాత్రమే ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అయితే కెరీర్ ప్రారంభం నుంచే అందాల ఆరబోతకు చాలా దూరంగా ఉంది రాశీ ఖన్నా. ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే గ్లామరస్ గా కనిపించింది.

ఇప్పుడు సినిమా అవకాశాల కోసం గ్లామర్ ను సైతం ఒలకపోసేందుకు రెడీ అయ్యిందట రాశీ ఖన్నా.

ఇందులో భాగంగానే వరుసగా ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార.

 తాజాగా ప్రత్యేకంగా మరో ఫొటో షూట్ లో పాల్గొంది రాశీ ఖన్నా. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి.

మరి వీటితో రాశీ ఖన్నా దశ తిరుగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో యోధ అనే సినిమా మాత్రమే ఉంది.