పుష్ప2 హీరోయిన్ రష్మిక ఏం చదువుకుందో తెలుసా?

06 December 2024

Basha Shek

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గా రిలీజైంది.

మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప 2 తొలి రోజే ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు రాబట్టి గత రికార్డులు బద్దలు కొట్టింది.

ఎప్పటిలాగే పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడు. అయితే ఈ సీక్వెల్ లో శ్రీవల్లిగా రష్మిక అభినయం నెక్ట్స్ లెవెల్ అని ప్రశంసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా జాతర సీక్వెన్స్ లో రష్మిక మందన్నా నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బన్నీనే డామినేట్ చేసే విధంగా ఆమె యాక్టింగ్ ఉందంటున్నారు

పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో రష్మిక మందన్నా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే..

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న రష్మిక చదువులోనూ టాప్ స్టూడింట్ అట. ఆమె ఆర్ట్స్ స్టూడెంట్.

రష్మిక  మందన్నా  సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేశారు. అదే సమయంలో మోడలింగ్ లోనూ అదృష్టం పరీక్షించుకుందీ ముద్దుగుమ్మ.

ఇక 2016లో కన్నడ చిత్రం కిరాక్ పార్టీ తో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.