బాలీవుడ్‌ సెలబ్రిటీలను వెంటాడుతోన్న డీప్‌ ఫేక్‌ జాడ్యం.. ఇప్పుడు ప్రియాంక 

08 December 2023

 డీప్‌ ఫేక్‌ వీడియోల జాడ్యం బాలీవుడ్ సెలబ్రిటీలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి

రష్మిక మందన్నా, కాజోల్‌, అలియా, కత్రినా కైఫ్‌.. ఇప్పుడు ప్రియాంక చోప్రా  డీప్‌ ఫేక్‌ బారిన పడింది

కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసినా డీప్‌ ఫేక్‌ జాడ్యం ఆగడం లేదు

ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా.. అందులోని వాయిస్‌ను మార్చి వైరల్ చేశారు

ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు లిప్‌ సింక్‌ అయ్యేలా ఈ డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్ చేశారు

ప్రస్తుతం ఈ  డీప్‌ ఫేక్‌ వీడియోపై ప్రియాంక అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీప్‌ ఫేక్‌ వీడియోల జాడ్యం బాలీవుడ్ సెలబ్రిటీలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి