మహేశ్- రాజమౌళి సినిమాలో పవర్ ఫుల్ విలన్‍గా స్టార్ హీరో

TV9 Telugu

04 July 2024

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి  ఫస్ట్ కాంబినేషన్‌లో ఓ పాన్ వరల్డ్ సినిమా రాబోతుంది.

భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి.

ఈ సినిమా కోసం మహేశ్‌ బాబు కూడా చాలా కష్టపడుతున్నాడు. తన లుక్‌ను కూడా మార్చుకున్నాడు. జిమ్‌లో బాడీని బిల్డ్‌ చేసుకుంటున్నాడు.  

ఈ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్‌  కోసం జక్కన్న అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను టీమ్ లోకి తీసుకుంటున్నట్లు  తెలుస్తోంది

ఇప్పటికే ఈ మూవీలో మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ నటిస్తున్నట్లు ఆ మధ్యన ఒక వార్త కూడా నెట్టింట వైరలైంది.

ఇక తాజాగా  మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లోని సినిమా ప్రతినాయకుడి పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ ఒకటి బయటకు వచ్చింది.

ఇందులో మహేశ్‌ బాబును ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపికపై జక్కన్న బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.