అందాల  ప్రణీత సుభాష్ అదరగొట్టిందిగా..  

06  september 2023

Pic Credit - Instagram

తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ప్రణీత శుభాష్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిది. 

ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్స్ ను అందుకుంది ఈ వయ్యారి భామ. సిద్దార్థ్ తో కలిసి బావ సినిమాలో నటించింది.

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో పవన్ తో స్టెప్పులు కూడా వేసింది.

ఆతర్వాత మహేష్ బాబు నటించిన బ్రహ్మోసవం సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో మహేష్ మరదలిగా కనిపించింది.

పెళ్లి తర్వాత ప్రణీత సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడు తల్లి కూడా అయ్యింది. అయినా కూడా అందంతో ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంది.గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ప్రణీత.

తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.ఆరంజ్ కలర్ కోట్ అదరగొట్టింది.

ఈ ఫోటోలకు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. అమ్మడి అందాన్ని పొగుడుతూ కొంటె కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు.