ప్రభాస్ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్.. అద్దిరిపోయిందంతే
TV9 Telugu
15 July 2024
గతేడాది సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడ కల్కి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.
జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్లు దాటేసింది. దరిదాపులో కొత్త సినిమాలేవీ కూడా లేవు.
దీంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా రికార్డు కలెక్షన్ల వేట ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే ప్రభాస్ తదుపరి సినిమా మారుతి డైరెక్షన్ లో ఉండనుంది. దీనికి రాజాసాబ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
దీంతో పాటు సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయనున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు.
అందుకే ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం.
స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో దర్శకుడు అను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి..