14 October 2023

హమ్మయ్యా.. ఎట్టకేలకు కొత్త సినిమా ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. 

Pic credit - Instagram

 తెలుగులో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది పూజా హెగ్డే. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన ఆడిపాడింది. స్టార్ డమ్ సంపాదించుకుంది. 

కానీ కొంతకాలంగా ఈ బ్యూటీకి అదృష్టం కలిసిరావడం లేదు. పెద్ద ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయం సాధించలేకపోతుంది పూజా.

ఆమె నటించిన బీస్ట్ సినిమా ఓ మాదిరిగా టాక్ తెచ్చుకుంది. ఇక ప్రభాస్ జోడిగా నటించిన రాధేశ్యామ్ సినిమా మాత్రం పూజా హెగ్డే నిరాశ మిగిల్చింది. 

అయినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గలేదు. తెలుగులో గుంటూరు కారం సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ మరి కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది. 

కానీ అనుహ్యంగా గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 ఇక ఆ తర్వాత పూజాకు తెలుగుతోపాటు.. హిందీలోనూ అవకాశారుల కరువయ్యాయి. ఇన్నాళ్లుగా పూజా చేతిలో ఒక్క సినిమా లేకుండా  ఉండిపోయింది. 

తాజాగా ఈ బ్యూటీకి మరో ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ జోడిగా ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. 

అక్టోబర్ 13న పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలుపుతూ ఈ సినిమాను అధికారింగా ప్రకటించారు.