11 October 2023

పూజా హెగ్డే ఆస్తులు అంత ఉంటాయా?.. ఎన్ని కోట్లు సంపాదించిందంటే.. 

Pic credit - Instagram

 చాలా కాలంగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు పూజా హెగ్డే. దీంతో తెలుగులో ఈ బ్యూటీ కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ టాక్ నడుస్తోంది. 

తెలుగు, తమిళం, హిందీలో ఎన్నో సినిమాల్లో నటించిన బుట్టబొమ్మ.. చాలా రోజులుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తుంది.

అయితే ఇప్పుడు పూజా హెగ్డే ఆస్తులకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరలవుతుంది. దాదాపు రూ.51 కోట్లకు అధిపతి అని టాక్. 

దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించింది. ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు.. ప్రకటనల కోసం దాదాపు రూ. 40 లక్షలు వసూలు చేస్తోందట. 

నెలకు దాదాపు రూ. 50 లక్షలు సంపాదిస్తుందట. అలాగే ఆమె వద్ద ఎంతో ఖరీదైన లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఉంది. అందులో ఒక కారు ధర రూ.2 కోట్లు. 

 ముంబైలోని బాంద్రాలో సముద్రానికి ఎదురురుగా 3BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు రూ. 6 కోట్లు ఉంటుందట. 

 అలాగే హైదరాబాద్‌లో  రూ.4 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆమె వద్ద ఖరీదైన బ్యాగ్స్ ఉన్నాయి. 

ఆమె వద్ద ఉండే లూయిస్ విట్టన్ హ్యాండ్‌బ్యాగ్ రూ.1.91 లక్షలు. అలాగే రూ.1.4 లక్షల విలువైన LV క్రోయిసెట్ హ్యాండ్‌బ్యాగ్‌ ఉంది.