హమ్మయ్య.. ఎట్టకేలకు ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. పెద్ద అవకాశమే..
24 September 2023
Pic credit - Instagram
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది బుట్టబొమ్మ పూజా హెగ్డే.
ఒకానొక సమయంలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేకుండా ఖాళీగా ఉంటుంది.
గుంటూరు కారం సినిమాలో కథానాయికగా ఎంపికై కొద్దిరోజులకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ చేరింది.
అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ అనుకున్నారు. కానీ ఆ సినిమా నుంచి కూడా ఈ ముద్దుగుమ్మను తొలగించారట.
అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో లేటేస్ట్ ఫోటోష్ షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ బిగ్ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన నటించి ఛాన్స్ వచ్చింది.
మలయాళ చిత్ర దర్శకుడు ఆండ్రూస్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న సినిమాలో పూజా హెగ్డే కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది.
వచ్చే నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నారు. మూడు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.