23 December 2023

Pic credit - Instagram

ఓటీటీలోకి బుట్టబొమ్మ ఎంట్రీ !.. లేడీ ఓరియంటెడ్ సినిమాలో పూజా.. 

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. కానీ ఇప్పుడు అసలు ఈ ముద్దుగుమ్మ పేరు కూడా వినిపించడం లేదు. చివరగా కిసి కా బాయ్ కిసీ కా జాన్‏లో కనిపించింది. 

ఈ ముద్దుగుమ్మకు చాలా కాలంగా వరుస డిజాస్టర్స్ రావడం.. ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆడకపోవడంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్స్ రావడం కరువయ్యాయి. 

తెలుగులో చివరగా రాధేశ్యామ్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం   సినిమాలో ఛాన్స్ కొట్టేసింది బుట్టబొమ్మ. 

కానీ అనుహ్యంగా ఆ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అటు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుంది పూజా 

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం పూజా హెగ్డేకు క్రేజీ ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. 

ఏవీఎం సంస్థ బ్యానర్ పై లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మించబోతున్నారట. ఇందులో పూజా హెగ్డేను మెయిన్ రోల్ కోసం సెలక్ట్ చేశారని  ఇండస్ట్రలీ టాక్ వినిపిస్తుంది. 

ఈ చిత్రానికి డిమాంటి కాలనీ, ఇమైకా నొడిగల్ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమా వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ కోసం ఏవీఎం నిర్మిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టబోతుంది పూజా హెగ్డే.