26 October 2023
రూ.4 కోట్ల విలువైన లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే..
Pic credit - Instagram
టాలీవుడ్ బుట్టబొమ్మ చేతిలో ప్రస్తుతం బాలీవుడ్ సినిమా మాత్రమే ఉంది. ఇందులో బీటౌన్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
అయితే కొన్నాళ్లుగా పూజా నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ ఇప్పుడు కష్టాల్లోనే ఉంది.
కెరీర్ పరంగా గ్యాప్ రావడంతో తన పర్సనల్ లైఫ్ కు కేటాయించింది పూజా. ఇటీవలే తన పుట్టిన రోజు వేడుకలను మాల్డీవ్స్లో జరుపుకుంది.
ఇప్పుడు ఈ బ్యూటీ కొత్త కారును కొనుగోలు చేసింది. దసరా సందర్భంగా రేంజ్ రోవర్ ఎస్వీ ఎస్యూవీ కారును కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం పూజా కొత్త కారుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో ఆ కారు ధర ఎంత అంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.
పూజా కొన్న లగ్జరీ కారు ధర రూ. 4 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారు గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
పూజా గ్యారేజ్ లో ఇప్పటికే పోర్షే కయెన్, జాగ్వార్, ఆడి క్యూ-7 ఉన్నాయి. ఇప్పటివరకు పూజా దాదాపు రూ.51 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది.
అంతేకాదు... ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. పూజాకు ముంబైలోని బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఓ అపార్ట్మెంట్ ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి.