19 September 2023

పట్టు చీరలో మెరిసిన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే అందమైన ఫోటోస్.. 

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. సౌత్ లో అత్యథిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో పూజా ఒకరన్న సంగతి తెలిసిందే.

తెలుగు, తమిళంతోపాటు హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించింది. కొంత కాలంగా ఈ బ్యూటీ నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. 

తాజాగా గణేష్ చతుర్థి సందర్భంగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. పట్టు చీరలో మరింత అందంగా మెరిసిపోయింది టాలీవుడ్ బుట్టబొమ్మ. 

ముంబైలో పుట్టి పెరిగిన పూజా మిస్ ఇండియా పోటీల్లో పాల్గోంది. అలాగే మోడలింగ్ రంగంలోనూ అడుగుపెట్టింది. దీంతో ఈ బ్యూటీకి సినీరంగంలో అవకాశాలు వచ్చాయి. 

మూగమూడి అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా.. తెలుగులో అక్కినేని నాగచైతన్య నటించిన ఒక లైల కోసం సినిమాలో కథానాయికగా నటించింది. 

ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ జోడిగా నటించి మెప్పించింది. అల.. వైకుంఠపురం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. 

 ఓవైపు తెలుగులో పలు సినిమాలు చేస్తున్న సమయంలోనే అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది పూజా. ఇటీవలే సల్మాన్ సరసన నటించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నిత్యం ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది.