తెలుగు తెరపైకి మరో అందాల తార.. ప్రగతి శ్రీ వాస్తవ ఎవరో తెలుసా ?..
26 September 2023
Pic credit - Instagram
తెలుగు తెరపైకి మరో అందాల తార సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. పెదకాపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది హీరోయిన్ ప్రగతి శ్రీ వాస్తవ.
సెలబ్రెటీ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి కథానాయికగా పరిచయం కాబోతుంది. అయితే సినిమాల్లోకి రావడానికి కొన్ని కండీషన్లతోనే ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాలంటే ప్రగతి తండ్రి ముందుగా ఒప్పుకోలేదట. ఎవరూ ఆ రంగంలో లేరు.. పైగా రంగుల ప్రపంచం ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డారట.
అయితే అన్ని రకాల పరిస్థితులను..విషయాలను తన తండ్రికి వివరించి ఒప్పించిందట ప్రగతి. తెరపై తన తండ్రి ఎప్పుడు చూసిన గర్వపడే పాత్రలు చేస్తానని తెలిపింది.
నాన్నకు ఇష్టం లేని ఎలాంటి పాత్రలు చేయనని.. ప్రతీ పాత్రకు సైన్ చేయనని .. ఇంట్లో ప్రామిస్ చేసినట్లు ఇటీవల పెదకాపు ఈవెంట్లో చెప్పుకొచ్చింది.
బలమైన భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేస్తానని.. అలాగే సమంత.. త్రిష.. తాప్సీ చిత్రాలు ఎక్కువగా ఇష్టపడి చూస్తానని తెలిపింది.
రామ్ చరణ్, వరుణ్ తేజ్ లతో ప్రాజెక్ట్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె గంగం గణేష చిత్రంలో నటిస్తున్నానని.. కొత్త ప్రాజెక్ట్స్ చర్చలో ఉన్నాయట.
తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే పెదకాపు రిలీజ్ తర్వాత ఈ బ్యూటికి మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది.