28 November 2023
ఫుల్ జోష్ లో పాయల్.. క్రేజీ ఆఫర్స్ కోసం వెయిటింగ్
ఆర్‌ఎక్స్ 100సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్
తొలి సినిమాతోనే తన నటనతో , అందంతో అభినయంతో ఆకట్టుకుంది పాయల్ రాజ్ పుత్.
ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోయి నటించి యువతను ఆకట్టుకుంది పాయల్.
ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. రవితేజ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలు
చేసింది.
కానీ పాయల్ కు ఆర్ఎక్స్ 100 లాంటి విజయం మాత్రం దక్కలేదు. ఓటీటీలో కూడా ఓ సినిమా చేసింది.
ఇదిలా ఉంటే ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేసింది పాయల్ రాజ్ పుత్.
ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మంగళవారం
హిట్ టాక్ తెచ్చుకుంది.
మంగళవారం హిట్ తో పాయల్ రాజ్ పుత్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలం తర్వాత హిట్ అందుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తుంది పాయల్.
ఇక ఈ చిన్నదానికి టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ రావడం ఖాయం గా కనిపిస్తుంది. మరి పాయల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాతో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడలి.
ఇక్కడ క్లిక్ చేయండి