పవన్ ఫ్యాన్స్ ను ఊరిస్తోన్న ఓజి ఫస్ట్ సింగిల్.. ఎప్పుడంటే?
TV9 Telugu
18 June 2024
రాజకీయాల కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ కెమెరాల ముందుకు రానున్నారు.
ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ ముందుగా లైనప్ లో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారని టాక్.
ఇందులో భాగంగా ముందుగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నాడట పవర్ స్టార్.
ఇక దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా సినిమాను పూర్తి చేయనున్నాడు పవన్.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది .మరో ఇరవై రోజులు షూటింగ్ చేస్తే సినిమాకు కొబ్బరి కాయ కొట్టవచ్చని టాక్.
అయితే ఓజీ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ తెగ వూరిస్తుంది. థమన్ ఆల్రెడీ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రెడీ చేశాడని సమాచారం.
త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుందని థమన్ ట్వీట్ చేసారు.దీంతో పవన్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు