05 December 2023

పెళ్ళికూతురిలా ముస్తాబైన ముద్దుగుమ్మ నిత్యా మీనన్

నిత్యామీనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ భామ ఈ చిన్నది.

నేచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

తొలి సినిమాతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ . ఆతర్వాత వరుస సినిమాలతో బిజీ ఆయ్యింది.

అంతకు ముందు బాల నటిగాను నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది నిత్యామీనన్. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటించింది .

వైవిధ్యమైన కథలను ఎంచుకు ప్రేక్షకులను ఆకట్టుకుంది నిత్యామీనన్. చివరిగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది.

భీమ్లానాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించింది నిత్యామీనన్. ఆతర్వాత తిరు సినిమాలో నటించింది.

తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో నిత్యామీనన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇక సోషల్ మీడియాలోనూ నిత్యామీనన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా పెళ్లి కూతురు గెటప్ లో రెడీ అయ్యి ఫోటోలు షేర్ చేసింది నిత్యా మీనన్. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.