05 December 2023

శ్రీలీల మల్టీటాలెంటెడ్ అమ్మాయి.. స్టేట్ లెవల్ ఛాంపియన్ ఈ బ్యూటీ.. 

Pic credit - Instagram

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. ఒకే ఒక్క సినిమాతో చేతిలో అరడజనుకు పైగా సినిమాలు పట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్. 

ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఆదికేశవ సినిమాతో ప్లాప్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఎక్స్‏ట్రా ఆర్టినరీ మ్యాన్ సినిమాలో నటిస్తుంది. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‏లో నిర్వహించగా.. శ్రీలీల మాల్టీటాలెంటెడ్ అమ్మాయి అన్ని అన్నారు నితిన్. ఎక్స్‏ట్రా ఆర్టినరీ అమ్మాయి అంట.

ఇప్పటికే యాక్టింగ్, డాన్స్‏తో అదరగొట్టేస్తోంది శ్రీలీల. అలాగే మరోవైపు డాక్టర్ చదువుతుంది. అలాగే భారతనాట్యం, కూచిపూడి కూడా చేస్తుందని అందరికీ తెలుసు. 

ఇవే కాకుండా శ్రీలల వీణ వాయిస్తుందని చెప్పాడు నితిన్. అలాగే స్టేట్ లెవల్‏లో స్విమ్మింగ్, హాకీ గేమ్ ఆడిందని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు హీరో నితిన్. 

ఇంత చిన్న పిల్లలో ఇన్ని ట్యాలెంట్స్ ఉన్నాయని తెలిసి తాను ఆశ్చర్యపోయానని.. ఈ సినిమా  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కానీ అసలు శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఉమెన్ అని అన్నారు.

దీంతో మరోసారి శ్రీలీల టాలెంట్స్ గురించి నెట్టింట వైరలవుతున్నాయి. ఓ పక్క డాక్టర్ చదువు.. మరోపక్క గేమ్స్, డాన్స్, ఇప్పుడు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. 

 కొద్ది రోజుల క్రితం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‏తో కలిసి సాంగ్ పాడి అలరించింది. అటు సింగర్‏గానూ తన బ్యూటీఫుల్ వాయిస్‏తో మెస్మరైజ్ చేసింది.