17 September 2023
ఎల్లోరా శిల్పమే ఈ అందాల నిధి.. నెట్టింట మాయ చేస్తోన్న సోయగం..
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సవ్యసాచి సినిమాతో అడుగుపెట్టింది నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
మొదటి రెండు చిత్రాలు నిరాశ పర్చడంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడు కష్టమే అన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో నిధికి అవకాశాలు తగ్గాయి.
ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో రామ్ పోతినేని హీరోగా నటించారు.
అయితే భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ సక్సెస్ సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం విఫలం అయ్యింది నిధి. అటు తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.
కానీ ఈ సినిమా విడుదల మాత్రం ఆలస్యంగా అవుతూ వస్తుంది. ఈ మూవీ విడుదల తర్వాత నిధికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.
అటు సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ అదరగొడుతుంది.
తాజాగా నిధి షేర్ చేసిన ఫోటోస్ చూస్తే ఎల్లో శిల్పం ఇలాగే ఉంటుందా అన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.