08 December 2023

నయనతారను వీడని విమర్శలు.. సాయం చేసిన తప్పేనా.. 

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకుంది. 

ఇటీవలే జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. షారుఖ్ ఖాన్ జోడిగా నటించిన ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సక్సెస్ ఫుల్‏గా ఎంట్రీ ఇచ్చింది. 

అయితే సినిమాల పరంగా సక్సెస్ అయినా.. ఈ హీరోయిన్ మీద నిత్యం విమర్శలు వస్తూనే ఉంటాయి. లేడీ సూపర్ స్టార్ అయినా ప్రతిసారీ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతుంటాయి. 

ఇప్పుడు మరోసారి నయన్ పై విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తమిళనాడులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించగా.. తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. 

తన వ్యాపార సంస్థ ఫెమీ 9 ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. దుస్తులు, ఆహారం, శానిటరీ న్యాప్ కిన్స్, వాటర్ బాటిల్స్, మెడిసిన్స్ అందించింది. 

దీంతో ఆమెకు అభిమానులతోపాటు నెటిజన్స్ అభినందనలు తెలిపారు. కానీ కొందరు మాత్రం నయనతార తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

తన కంపెనీకి చెందిన ఫెమీ 9 అడ్వర్టైజ్మెంట్ బోర్డులతో ఉన్న  వాహనంలో వరద బాధితులకు సాయం అందించడం ఏంటీ ? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. 

విపత్తు సమయంలోనూ తన కంపెనీని ప్రమోట్ చేసుకోవడం ఏంటీ ?.. అంటూ లేడీ సూపర్ స్టార్ పై విమర్శలు చేస్తున్నారు. అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.