07 October 2023
Pic credit - Instagram
నేహాశెట్టి ఆశలు గల్లంతు.. రాధిక ఆశలన్ని ఈ సినిమాపైనే ఇక..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నేహాశెట్టి. డీజే టిల్లు సినిమాతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
ఈ సినిమా తర్వాత తెలుగులో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
ఇటీవలే బెదురులంక 2012 సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. కార్తికేయ నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే అక్టోబర్ 6న విడుదలైన రూల్స్ రంజన్ సినిమా మాత్రం నేహాను నిరాశపరిచింది. మంచి బజ్ పై విడుదలైన ఈమూనీ మిక్డ్స్ టాక్ అందుకుంది.
దీంతో ఇప్పుడు నేహా ఆశలన్ని గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా పైనే ఉన్నాయి. ఇందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్లామర్ పరంగా ఈ చిత్రంలో నేహా మరోసారి మెప్పించనుంది.
ఇండస్ట్రీలో నేహాకు బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు వస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఖాతాలో హిట్టు పడడం లేదు. కేవలం డీజే టిల్లు మాత్రమే హిట్టైంది.
ఇక ఇప్పుడు రూల్స్ రంజన్ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ బ్యూటీ ఆశలన్నీ ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీపైనే ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.