బంపర్ ఆఫర్ కొట్టేసిన నజ్రియా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
09 September 2023
Pic credit - Instagram
రాజా రాణి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ హీరోయిన్ నజ్రియా. ఈ మూవీతో ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో అంటే సుందరానికీ సినిమా చేసింది నజ్రియా. ఇందులో హీరో నాని ప్రధాన పాత్రలో నటించారు. నజ్రియాకు ఇదే తొలి తెలుగు చిత్రం.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు నజ్రియా.
తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మకు ఓ స్టారో హీరో సినిమాలో నటించే క్రేజీ ఛాన్స్ వచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్ అనే మూవీ చేయనున్నాడు.
ఇవే కాకుండా ఆకాశమే హద్దురా తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించాల్సి ఉంది. ఇందులో అదితి శంకర్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం నజ్రియా పేరు వినిపిస్తోంది. ఇందులో నజ్రియాను హీరోయిన్ పాత్ర కోసం సెలక్ట్ చేశారా లేదా ఇంకేదైనా స్పెషల్ రోల్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.
అంతేకాకుండా ఇందులో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ చేయనున్నారు. ఇదే జరిగితే సూర్యతో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.