TV9 Telugu
100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను: నయన తార
28 Febraury 2024
దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయన తారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇటీవలే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాతో బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందీ అందాల తార.
ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది నయనతార.
అయితే తాజాగా నయన తార ఓ భారీ ఆఫర్ ను వదిలేసుకుందట. 100 కోట్లు ఇచ్చినా ఆసినిమా చేయను అని తెగేసి చెప్పేసిందట.
ఇంతకీ నయన తార తిరస్కరించిన సినిమాలో హీరో మరెవరో కాదు.. గతేదాది లెజెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బిజినెస్ మెన్ లెజెండ్ శరవణన్.
తన తదుపరి సినిమాలో నయనతారను ఎలాగైనా హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని లెజెండ్ శరవణన్ తెగ ప్రయత్నాలు చేశాడట.
ఒక రోజు ఆమె ఇంటికి తన మేనేజర్ ను పంపి ఎవరూ ఊహించనంత పారితోషికం ఇస్తామని కక్రేజీ ఆఫర్ ఇచ్చాడట లెజెండ్ శరవణన్
అయితే నయన్ మాత్రం 100 కోట్లు ఇచ్చినా శరవణన్ పక్కన నటించను అని మేనేజర్ ముఖం మీదే తెగేసి చెప్పేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ఇక్కడ క్లిక్ చేయండి..