కావాలంటే గిచ్చి చూసుకోండి.. ఆ రూమర్లపై నయనతార
28 October 2024
Basha Shek
ఈ మధ్యన సినిమా హీరోయిన్లపై ప్లాస్టిక్ సర్జరీల రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇటీవల అలియాపై ఈ రూమర్లు వచ్చాయి.
గతంలో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయన తార ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు ప్రచారం జరిగింది
ఈ ప్రచారంపై తాజాగా స్పందించిన నయనతార తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపింది
'నా కనుబొమలు అంటే నాకు చాలా ఇష్టం. సందర్భాన్ని బట్టి వాటి ఆకారాన్ని ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉంటాను'
'ముఖ్యంగా ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకు ముందు నా కనుబొమ్మల ఆకృతిని మార్చుతుంటాను. ఇందుకోసం చాలా టైమ్ కేటాయిస్తాను'
'దీనిని చూసే నా ముఖంలో మార్పులు వచ్చాయని చాలామంది అనుకొని ఉంటారు. కానీ అది నిజం కాదు'
'అలాగే డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. కానీ నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు'
'కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు' అని తనపై వస్తోన్న ప్టాస్టిక్ సర్జరీ రూమర్లను కొట్టి పారేసింది నయన తార.
ఇక్కడ క్లిక్ చేయండి..