22 November 2023

మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నయనతార.. 

Pic credit - Instagram

నాలుగు పదుల వయసులోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ నయతార. ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ అందుకుంది. 

ఇటీవల షారుఖ్ జోడిగా జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఓవైపు నటన.. మరోవైపు పిల్లల బాధ్యతత. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారం. ఇలా క్షణం తీరిక లేకుండా బిజీగా జీవితాన్ని గడుపుతోంది నయనతార. 

ప్రస్తుతం ఆమె తన 75వ చిత్రం మాధవన్, సిద్ధార్థ్ కలిసి నటిస్తోన్న టెస్ట్ మూవీలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. 

 అలాగే ఆమె నటించిన అన్నపూరణి సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ రానుందట. 

హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నయన్ నటించనున్నారని తెలుస్తోంది.  ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని టాక్. 

ఈ సినిమాతోపాటు.. నయన్ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగులోనూ మరోసారి నయన్ కు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.