చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగుళూరు బ్యూటీ నయనతార. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళి భాషల్లో సినిమాలు చేసింది.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన నటనతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ..మరోవైపు లేడీ ఓరియెంటేడ్ చిత్రాలు చేస్తుంది.
దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుంది నయనతార. ఇప్పుడు ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది నయన్.
ఇండస్ట్రీలో నయనతార కథానాయికగా అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. నయన్ కెరీర్ లో 75వ సినిమాగా అన్నపూరణి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 1న అడియన్స్ ముందుకు వచ్చింది.
ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఎస్.ఆర్.రవీంద్రన్ సమర్పణలో నాస్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది.
డిసెంబర్ 29 నుంచి ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం నయన్ హిందీలో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్.