09 December 2023

లేడీ సూపర్ స్టార్ అని పిలిస్తే తిట్టినట్లు అనిపిస్తుంది.. నయనతార..

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే. ఆమెను అభిమానులు ముద్దుగా అలా పిలుచుకుంటారు. కానీ అలా పిలవడం తనకు నచ్చడంలేదంటుంది నయన్. 

 లేడీ సూపర్ స్టార్ అని పిలిస్తే తనను తిట్టినట్లు అనిపిస్తుందని.. తనను అలా పిలవడం నచ్చదని తెలిపింది. కానీ జవాన్ తర్వాత అదే పేరుతో పిలుస్తున్నారని తెలిపింది. 

ప్రస్తుతం నయన్ అన్నపూరణి అనే తమిళ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ కామెంట్స్ చేసింది.

ఓ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ లేడీ సూపర్ స్టార్ నయనతార అంటూ ప్రేక్షకులకు పరిచయం చేసింది. దీంతో వెంటనే నయన్.. తనను ఆ పేరుతో పిలవద్దని తెలిపింది. 

 లేడీ సూపర్ స్టార్ అనేది అభిమానులు నాకు ఇచ్చిన బిరుదు. కానీ కొన్ని సందర్భాల్లో నేను నటించిన సినిమాలు విఫలమయ్యాయి. ఆ సమయంలో కొందరు నన్ను తిట్టారు. 

కానీ ఇప్పుడు జవాన్ సినిమా సక్సెస్ తర్వాత అందరూ నన్ను అదే పేరుతో పిలుస్తున్నారు. అదంతా వారి అభిమానం. అందరి ప్రేమకు కారణం ఇండస్ట్రీవల్లే అని భావిస్తాను. 

ఇంత ప్రేమను, కీర్తిని పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి అంటూ  చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయనతార చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.