20 October 2023
రెండో సినిమాకే భారీగానే పారితోషికం పెంచేసిన నయనతార..
Pic credit - Instagram
ఇటీవలే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నయనతార. షారుఖ్ జోడిగా కనిపించిన నయన్.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఇటీవలే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నయనతార. షారుఖ్ జోడిగా కనిపించిన నయన్.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
జవాన్ మూవీ ఊహించని రేంజ్ లో హిట్ కావడంతో బీటౌన్ లో నయన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి.
అయితే జవాన్ సినిమాకు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న నయన్.. ఇప్పుడు తన రెండో సినిమాకు పారితోషికం పెంచిందని టాక్ వినిపిస్తుంది.
సంజయ్ లీల భన్సాలీ సినిమాకు నయన్ ఏకంగా రూ. 13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు మేకర్స్ సైతం ఓకే చేశారని టాక్ నడుస్తోంది.
ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార.. మరోవైపు వ్యాపారరంగంలోనూ దూసుకుపోతుంది. ఇటీవలే సొంతంగా కాస్మోటిక్స్ బ్రాండ్ ఓపెన్ చేసింది.
చర్మ సంరక్షణకు సంబంధించి పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తుంది నయన్. ఈ బ్రాండ్ కు తనే అంబాసిడర్గా వ్యవహరిస్తుంది. పలు యాడ్స్ చేసింది.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం తమిళంలో ఒరువన్ 2 చిత్రంలో నటిస్తుంది నయనతార. ఇందులో మరోసారి కోలీవుడ్ హీరో జయం రవి జోడిగా నయన్ కనిపించనుందట.
ఇక్కడ క్లిక్ చేయండి.