12 September 2023

లేడీ సూపర్ స్టార్ రెమ్యునరేషన్ డిమాండ్.. బాబోయ్ 'తగ్గేదే లే' అంటోన్న నయన్.. 

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించిందీ లేడీ సూపర్ స్టార్. 

తెలుగులో అగ్ర హీరోలందరి జోడిగా నటించి అలరించింది ఈ బ్యూటీ. ఇక ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి తొలి చిత్రానికే హిట్ అందుకుంది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జోడిగా జవాన్ చిత్రంలో నటించింది. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగా.. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించారు.

అయితే ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ అడుగుపెట్టినప్పటికీ  నయనతారకు మాత్రం పోటీగా ఎవ్వరూ ఉండడం లేదంటే నయన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇక నయన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా నయన్ రెమ్యునరేషన్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లిస్టులో ఆమె నెంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం. 

అయితే ఇప్పటివరకు నయన్ ఆరు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ... జవాన్ చిత్రానికి మాత్రం రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఇప్పుడు ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అవకాశాలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా మరిన్ని అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉన్నాయి.