18 November 2023
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార.. రెమ్యునరేషన్ ఎంతంటే..
Pic credit - Instagram
దాదాపు 20 ఏళ్లుగా వెండితెరపై కథానాయికగా అలరిస్తోంది నయనతార. సౌత్ అడియన్స్ ఆమెను లేడీ సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
ఈరోజు (నవంబర్ 18న) నయనతార పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సీని ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది నయనతార. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
దీంతో నయన్ రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లుగా తెలుస్తోంది. షారుఖ్ సరసన నటించిన జవాన్ సినిమాకు దాదాపు రూ.10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమా కోసం దాదాపు రూ.13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అటు తమిళంలోనూ భారీగానే డిమాండ్ చేస్తుందట.
ఇక దాదాపు రెండు దశాబ్దాలుగా నటిగా కొనసాగుతున్న నయనతార.. ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు సంపాదించినట్లుగా టాక్ వినిపిస్తుంది.
నయనతార సినిమా పరంగానే కాకుండా బిజినెస్ రంగంలోనూ భారీగానే సంపాదిస్తుంది. సొంతంగా నిర్మాణ సంస్థ, స్కిన్ కాస్మోటిక్స్ ద్వారా సంపాదిస్తుంది.
అంతేకాకుండా చెన్నై, హైదరాబాద్‌లలో విలాసవంతమైన ఇళ్ళు ఉన్నాయి. అలాగే సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఈరోజు నయనతార బర్త్ డే.
ఇక్కడ క్లిక్ చేయండి.