మోక్షజ్ఞ మొదటి సినిమాకే భారీ బడ్జెట్.. ఏకంగా అన్ని కోట్లా?

17 September 2024

Basha Shek

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది.

హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో  మోక్షజ్ఞ తన తొలి చిత్రాన్ని చేయనున్నాడు.

ఇటీవలే నందమూరి మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా  బాలయ్య వారసుడి మొదటి  చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది

దీంతో మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల ఆకాంక్ష ఎట్టకేలకు  తీరనుంది.

అయితే నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా నే హైలెవెల్ లో భారీ బడ్జెట్ తో తీయనున్నారన్న సమాచారం బయటికి వచ్చింది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో రెండో చిత్రంగా మోక్షజ్ఞ మూవీ ఉండనుంది. ఇందులో మోక్ష సూపర్ హీరోగా కనిపించనున్నాడు.

ప్రశాంత్ వర్మ కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందుతుందని అంచనాలు ఉన్నాయి

దీంతో నందమూరి మోక్షజ్ఞ మొదటి చిత్రంలో గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం భారీ బడ్జెట్ అవసరమని టాక్.