14 January 2024
'నా సామిరంగ'.. ఆషికాకు ఇక టాలీవుడ్లో అవకాశాలు కలిసొచ్చేనా ?..
TV9 Telugu
Pic credit - Instagram
సంక్రాంతి పండక్కి అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది నా సామిరంగ సినిమా. నాగార్జున హీరోగా ఆషిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
జనవరి 14న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇందులో కథానాయికగా నటించిన ఆషిక నటనకు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి.
అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.
ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. కానీ ఇప్పుడు విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగ్ నటించిన నా సామిరంగ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.
ఇందులో ఆషికా తన సహజ నటనతో ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రంలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా పట్టుచీరల్లో మరింత అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు నా సామిరంగ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తుండడంతో అందరి చూపు ఆషికాపైనే ఉంది. ఇకనైనా ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు వస్తాయా ?..
కన్నడలో స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది ఆషికా. అక్కడ టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అవకాశాలు అంతగా రావడం లేదు.
నా సామిరంగ సినిమా తర్వాత ఆషికాకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమాలో పనిచేయాలని ఉందంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చేయండి.