సింగిల్‏గానే ఉన్నానంటోన్న మృణాల్ ఠాకూర్.. వరుడి వేటలో పేరెంట్స్.. 

Pic credit - Instagram

12 October 2023

సీతారామం సినిమాతో యువ హృదయాలను కొల్లగొట్టేసింది బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో నటనతో విమర్శకులను మెప్పించింది. 

 ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది మృణాల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు. 

ఓ ప్రముఖ నటుడిని ఉద్దేశిస్తూ.. అతనిలాంటి జీవిత భాగస్వామి తనకు కావాలని కోరారు. అలాగే ఇప్పుడు తనకు పెళ్లి గురించి కుటుంబం నుంచి ఒత్తిడి ఉందట. 

ఇకనైనా పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ తనను అడుగుతున్నారని..  ఇప్పుడు  తన కోసం తన కుటుంబసభ్యులు వరుడిని వెతుకుతున్నారంటూ చెప్పుకొచ్చింది మృణాల్. 

అయితే తనకు మాత్రం ప్రస్తుతానికి పెళ్లిపై ఎలాంటి ఆసక్తి లేదని...ఇప్పుడంతా తన ఫోకస్ కేవలం సినిమాలపై.. కెరీర్ పైనే ఉందని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. 

ఇక కెనడియన్ నటుడు కీను రీవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతడి లాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది  ఈ ముద్దుగుమ్మ. 

 సీతారామం సినిమా తర్వాత తెలుగులో తనను అభిమానించే వారి సంఖ్య పెరిగిందని.. వారి అంచనాలకు తగిన విధంగా గొప్ప సినిమాల్లో నటించాలనుకుంటుదట.

 ప్రస్తుతం ఈ బ్యూటీ హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది. ఇందులో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ కొత్త సినిమాలోనూ నటిస్తోంది.