07 January 2024
మృణాల్ ఠాకూర్ బ్యూటీ రహస్యం ఇదే.. కొరియన్ చిట్కా పాటిస్తుందట..
TV9 Telugu
Pic credit - Instagram
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే సీతామహాలక్ష్మిగా ఏదో మ్యాజిక్ చేసింది.
హోమ్లీ లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ తో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. సౌత్, నార్ ఇండస్ట్రీలను ఏలేస్తుంది.
ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇందులో యష్ణ పాత్రలో కనిపించి మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
చిత్రపరిశ్రమలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే గ్లామర్ మెయింటెయిన్ చేయాల్సిందే అని.. అందుకు బ్యూటీ టిప్స్ ఫాలో అవుతానని అంటోంది మృణాల్.
ముఖానికి పసుపు రాసుకుంటానని... తాజా పండ్లతో ఫేస్ ప్యాక్ వేసుకుంటుందట. ముఖం కాంతిమంతంగా ఉండేదుకు కొరియన్ చిట్కా ఫాలో అవుతుందట.
ముఖం కాంతిమంతంగా ఉండేందుకు రోజు బియ్యం కడిగిన నీళ్లను ముఖంపై స్ప్రే చేసుకుంటనానని.. ఇది కొరియన్ బ్యూటీ చిట్కా అని తెలిపింది మృణాల్.
టీవీ నటులకు సినీ పరిశ్రమలో అవకాశాలు తక్కువగా వస్తుంటాయని.. చిన్న చిన్న క్యారెక్టర్లతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమేనని తెలిపింది.
ఎన్నో అడ్డంకులు దాటుకొని, స్వయంకృషితో ఇక్కడిదాకా వచ్చానని.. పరిశ్రమలో మరింత ఎత్తుకు ఎదిగాలని.. మంచి సినిమాలు, పాత్రలు చేయాలని ఉందట.
ఇక్కడ క్లిక్ చేయండి.