13 September 2023

మృణాల్ చేసిన పనికి ఫిదా అవుతోన్న తెలుగు అడియన్స్.. ఏం  చేసిందంటే.. 

Pic credit - Instagram

సీతారామం సినిమా తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో సీతామహాలక్ష్మి పాత్రతో తెలుగు వారికి దగ్గరయ్యింది ఈ బాలీవుడ్ బ్యూటీ. 

తొలి చిత్రానికే నటనకు ప్రశంసలు అందుకుంది మృణాల్. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ప్రస్తుతం హాయ్ నాన్న చిత్రంలో నటిస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇందులో న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

అలాగే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రంలోనూ నటిస్తోంది మృణాల్. తొలిసారిగా వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. 

అలాగే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టులోనూ ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. చిరు సినిమాలో మృణాల్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. 

తాజాగా మృణాల్ చేసిన పని చూసి ఫిదా అవుతున్నారు అడియన్స్. ఎందుకంటే వరుస ఆఫర్స్ వస్తుండడంతో తెలుగు నేర్చుకోవడానికి సమయం కేటాయించింది. 

రాత్రి పూట ల్యాప్ టాప్ లో ఆన్లైన్ లో బట్టి పట్టి మరీ.. ఓవైపు రాసుకుంటూ తెలుగు నేర్చుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది. 

ఇప్పటివరకు తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ పగలంతా షూటింగ్ లో పాల్గొని రాత్రిళ్లు ఇలా తెలుగు నేర్చుకోవడం చూసి అభినందిస్తున్నారు.