TV9 Telugu
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుంది.. కానీ అది..
30 March 2024
సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేసింది బాలీవుడ్ అందాల తార మృణాళ్ ఠాకూర్
ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు మన ముందుకు వస్తోందీ ముద్దుగుమ్మ.
పరశురాం తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏప్రిల్ 5 న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో పాల్గొన్న మృణాళ్ ఠాకూర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సెలబ్రిటీ లైఫ్ కాకుండా అందరిలాగే నాక్కూడా సాధారణ జీవితాన్ని గడపాలని అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చింది మృణాళ్ ఠాకూర్.
ఇరవైలో పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కని వారితో కలిసి డిన్నర్‌కు వెళ్తే ఎంతో బాగుంటుందంటూ మనసులో మాట బయట పెట్టింది మృణాళ్.
ఇక తనకున్న అతి పెద్ద భయం మరణమని, దాని గురించి ఆలోచిస్తేనే భయమేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది మృణాళ్
తాను చనిపోతే అమ్మానాన్నలు, కుటుంబ సభ్యులు ఏమైపోతారోనంటూ భవిష్యత్ గురించి ఏదేదో తల్చుకుని మాట్లాడిందీ అందాల తార.
ఇక్కడ క్లిక్ చేయండి..