గుంటూరు కారం తర్వాత మీనాక్షిని అందుకోవడం కష్టమేనా ?..
07 September 2023
Pic credit - Instagram
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది హర్యానా బ్యూటీ మీనాక్షి.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత ఖిలాడి చిత్రంలో నటించింది మీనాక్షి. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
ఇటీవల హిట్ మూవీలో అడివి శేష్ సరసన కనిపించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా మీనాక్షి తెలుగులో పాపులారిటీ వచ్చేసింది.
దీంతో ఏకంగా మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న గుంటూరు కారం సినిమాలో మీనాక్షి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో శ్రీలీలకు ఈక్వల్ రోల్ లో మీనాక్షి పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు యంగ్ హీరోయిన్స్ కూడా పోటీ పడి నటిస్తున్నారని సమాచారం.
మరోవైపు సోషల్ మీడియాలో తన లేటేస్ట్ అప్డేట్స్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తన క్యూట్ స్టిల్స్, స్కిన్ షో ఫోటోస్ వైరలవుతున్నాయి.
గుంటూరు కారం తర్వాత మీనాక్షికి తెలుగులో మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ తో మట్కా సినిమాలో నటిస్తుంది మీనాక్షి.
ఈ రెండు సినిమాల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మీనాక్షి రేంజ్ మారిపోవడం మాత్రం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అదే జరిగితే తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంటుంది.