15 September 2023

మరో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. ఆ స్టార్ హీరోకు జోడిగా.. 

Pic credit - Instagram

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది మీనాక్షి చౌదరి. ఇందులో శ్రీలీల కూడా కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

గుంటూరు కారం సినిమాలో మీనాక్షి నటిస్తుండడంతో నిత్యం ఆమె పేరు వార్తలలో నటిస్తోంది.  అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. 

తెలుగులోనే కాకుండా అటు ఇతర భాషల్లోనూ ఈ అమ్మడు నటించేందుకు సైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మరో క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. 

మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో  ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి హీరోయిన్ గా ఎంపికైదట. 

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇందులో మీనాక్షి చౌదరిని కథానాయికగా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. 

 అయితే గుంటూరు కారం సినిమాలో నటిస్తుండడంతోనే తెలుగులో మీనాక్షికి వరుస అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది మీనాక్షి. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. 

ఇటు తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గుంటూరు కారం విడుదలకు ముందే అమ్మడి క్రేజ్ మారిపోయింది.