05 November 2023
ఆ స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి..
Pic credit - Instagram
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మీనాక్షి చౌదరి. తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం తెలుగులో గుంటూరు కారం చిత్రంలో నటిస్తుంది మీనాక్షి. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈసినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారు.
ఈ సినిమానే కాకుండా తెలుగు వరుణ్ తేజ్ జోడిగా మట్కా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి. త్వరలోనే ఈ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
అలాగే తమిళంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి జోడిగా ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు మీనాక్షి థాయ్ లాండ్ చేరుకున్నారు. అంతకుముందే దుబాయ్ లో ఎడారి ప్రాంతంలో ఫోటోషూట్స్ చేసింది.
అక్కడ ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్ లో ఫోటోషూట్స్ చేసింది మీనాక్షి చౌదరి.
2019లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటిగా అరంగేట్రం చేసింది ఈ హార్యానా బ్యూటీ. ఆ తర్వాత తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా చేసింది.
ఇటీవలే హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ ఈ బ్యూటీ వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.