స్పీడ్ పెంచిన మీనాక్షి చౌదరి.. వరుస ఆఫర్స్ 

05  september 2023

Pic Credit - Instagram

సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ మీనాక్షి చౌదరి.

అంతకంటే ముందు పలు వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో కూడా నటించింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.

రవితేజ సరసన ఖిలాడీలో నటించింది మీనాక్షి. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతో కవ్వించింది ముద్దుగుమ్మ మీనాక్షి.

ప్రస్తుతం ఈ చిన్నదానికి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఈ చిన్నది ఛాన్స్ దక్కించుకుంది.

మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

అంతే కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది .

2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది మీనాక్షి చౌదరి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.

రీసెంట్ గా మీనాక్షి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ మిర్చిగా హీటు పుట్టిస్తుంది ఈ వయ్యారి.