ఇకపై సినిమాల్లో అలాంటివి చేయను.. మీనాక్షి చౌదరి సంచలన నిర్ణయం
01 December 2024
Basha Shek
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ జోష్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మీనాక్షి చౌదరి.
సక్సెస్, ఫ్లాప్ అనే సంగతి పక్కన పెడితే ఆ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు నెలకొకటి విడుదలవుతున్నాయి.
కాగా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాతో తన కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది మీనాక్షి చౌదరి.
ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అంతేకాదు ఇందులో మీనాక్షి పోషించిన సుమతి పాత్ర కూడా బాగా హైలెట్ అయ్యింది.
థియేటర్లలో భార వసూళ్లు రాబట్టిన లక్కీ భాస్కర్ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోంది.
కాగా ఈ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై హీరోకు భార్యగా, బిడ్డకు తల్లిగా నటించదట.
కెరీర్ ప్రారంభంలోనే భార్యగా, బిడ్డకు తల్లిగా నటించకపోవడం చాలా మంచిదని ఆమె స్నేహితులు సలహా ఇచ్చారట.
అందుకే కేవలం యాక్షన్‌తో కూడి కమర్షియల్ కథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నానంటోంది మీనాక్షి చౌదరి.
క్లిక్ చేయండి..