10 October 2023

అప్పుడే రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన 'గుంటూరు కారం' బ్యూటీ.. 

Pic credit - Instagram

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మీనాక్షి చౌదరి. ఇంతకుముందు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.

కానీ ఎప్పుడైతే మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసిందో అప్పటి నుంచి ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. 

గుంటూరు కారం సినిమానే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటూ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది మీనాక్షి చౌదరి. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ గట్టిగానే పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిదే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ ఏకంగా కోటిన్నర వరకు డిమాండ్ చేస్తోందని  సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గుంటూరు కారం తర్వాతే అవకాశాలు వస్తున్నాయి. 

గుంటూరు కారం, విశ్వక్ సేన్ వీఎస్ 10, వరుణ్ తేజ్ మట్కా, సింగపూర్ సలూన్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాల్లో మీనాక్షి నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్‏గా మీనాక్షి ఇప్పుడు గట్టిగానే డిమాండ్ చేస్తుందట. తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటుందట.