07 December 2023

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన గుంటూరు కారం బ్యూటీ.. ఏ సినిమా అంటే..

Pic credit - Instagram

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. హిట్ 2 సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. దీంతో ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. 

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఇందులో శ్రీలీల సైతం కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఈ ముద్దుగుమ్మ సద్వినియోగం చేసుకుంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది. తాజాగా మరో ఛాన్స్ కొట్టేసింది.

ప్రస్తుతం నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇందులో మొత్తం ముగ్గురు నాయికలు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక పాత్రకు మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే అఫిషియల్ అనౌన్స్ రాలేదు. 

ఒకవేళ ఇదే నిజమైతే.. మీనాక్షి చౌదరికి మరింత క్రేజ్ వచ్చినట్లే తెలుస్తోంది. ఓవైపు గుంటూరు కారం.. మరోవైపు బాలయ్య సినిమాలో మీనాక్షి నటిస్తే.. ఇక మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం. 

 ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఓవైపు సెట్‏లో ఉండగానే.. మరో ఛాన్స్ కొట్టేసింది. 

కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ పారితోషికం సైతం తక్కువగా తీసుకుంటుండంతో అవకాశాలు ఎక్కువే వస్తున్నాయి.